Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్నయ్య తెల్లారింది లేరా తెల్లారింది వేళ Telugu Christian Song Lyrics

అన్నయ్య తెల్లారింది లేరా తెల్లారింది వేళ Lyrics

అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)
అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా ||తెల్లారింది||
చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా ||తెల్లారింది||

Your favourites

  • No Favourites found!