Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్నీ సాధ్యమేయేసుకు అన్నీ సాధ్యమే అద్భుత Telugu Christian Song Lyrics

అన్నీ సాధ్యమేయేసుకు అన్నీ సాధ్యమే అద్భుత Lyrics

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే||
మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే||
బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే||
ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే||
కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||

Your favourites

  • No Favourites found!