Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు Telugu Christian Song Lyrics

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు Lyrics

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును       ||అన్ని||

కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

Your favourites

  • No Favourites found!