Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు ఏ Telugu Christian Song Lyrics

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు ఏ Lyrics

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||
కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||
ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||

Your favourites

  • No Favourites found!