Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అనుదినము మా భారము భరించే దేవాఅనిశము Telugu Christian Song Lyrics

అనుదినము మా భారము భరించే దేవాఅనిశము Lyrics

అనుదినము మా భారము - భరించే దేవా
అనిశము నీ మేళ్ళతో - నింపుచున్నావు
1. సన్నుతించు మనిశము - నా ప్రణమా యేసుని
పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు
ఒంటె బరువు దీవెనలు - వీపున మోసె
2. నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా
వేదనతో వేడగా - ధైర్యమిచితివి
నా కృప నీ కెల్లప్పుడు - చాలునంటివి
3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా
నీ రక్తముతో మమ్ము - విమోచించితివి
నీదు కృప మహదై-శ్వర్యంబును బట్టి
4. అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను
సమృద్ధితో మమ్ములను - సాకుచుంటివి
కృపా క్షేమములను మాపై - కుమ్మరించితివి
5. సర్వవేళల సంతృప్తిని - నేర్పినావు మాకిల
సకలంబును చేయుటకు - శక్తి నిచ్చితివి
బలపరచుము నిన్ను బట్టి - బలుడవు దేవా

Your favourites

  • No Favourites found!