అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం
దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన
బాలుఁడేసు ||ననుకరించెద||
1. పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును
జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద||
2. తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి
నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
3. పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ
బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
4. శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు
రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
5. పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ
వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
6. యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య
మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
7. అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి
ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
8. ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని
సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
9. భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది
సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు Lyrics
Your favourites
- No Favourites found!
