Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల Telugu Christian Song Lyrics

అన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల Lyrics

అన్యజనులేల లేచి - గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల
అను జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి
1. భూలోక రాజులు లేచి - వారేకముగా ఆలోచించి
వారి పాశములను తెంపి - పారవేయుద మనుచున్నారు
2. ఆకాశ వాసుండు - వారిని - అపహసించుచున్నాడు - నవ్వి
వారలతో పల్కి కోపముతో - వారిని తల్లడిల్ల చేయును
3. పరిశుద్ధమైన - నాదు - పర్వతమగు సీయోను మీద
నారాజునాసీనునిగా జేసి - యున్నానని సెలవిచ్చెను
4. కట్టడ వివరింతు - నాకు - యిట్లు చెప్పెను యెహోవాయందు
నీవు నా కుమారుండవు - నిన్ను నేను కనియున్నాను
5. నన్ను అడుగుము - నీకు - జనముల భూమిని స్వాస్థ్యముగా
దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు
6. ఇనుప దండముతో - నీవు - వారిని నలుగగొట్టెదవు
కుండను పగులగొట్టునట్లు - వారిని పగులగొట్టెదవు
7. ఓ రాజులారా - మీరు - జ్ఞానవంతులై యుండుడి
ఓ భూపతులారా - మీరు - నాభోద నొందుడి నేడే


Your favourites

  • No Favourites found!