Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అపరాదిని యేసయ్యాఅపరాధిని యేసయ్య  అపరాధిని Telugu Christian Song Lyrics

అపరాదిని యేసయ్యాఅపరాధిని యేసయ్య అపరాధిని Lyrics

అపరాదిని యేసయ్యా
అపరాధిని యేసయ్య
పల్లవి: అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..
1. సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..
2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని..
3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ..అపరాధిని..
4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ..అపరాధిని..
5. ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా ..అపరాధిని..

Your favourites

  • No Favourites found!