Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యానెపమెంచకయె Telugu Christian Song Lyrics

అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యానెపమెంచకయె Lyrics

అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు ||అప||

1. సిలువకు నిను నే గొట్టితిని తులవలతో జేరితిని
కలుషంబులను మోపితిని దోషుండనేను ప్రభువా ||అప||

2. ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో ||అప||

3. ముళ్లతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ ||అప||

4. దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితినీ దేహంబుగాయంబులను ||అప||

5. ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా ||అప||

6. చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత
నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా ||అప||

7. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా ||అప||

Your favourites

  • No Favourites found!