Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన Telugu Christian Song Lyrics

ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన Lyrics

ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే
అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2)
తల్లి కన్నా తండ్రి కన్నా
కాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున||
నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు
నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2)
ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు
భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు
ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు
నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా ||ఆపత్కాలమున||
నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత
రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2)
మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ
చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ
నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2) ||ఆపత్కాలమున||

Your favourites

  • No Favourites found!