Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో Telugu Christian Song Lyrics

అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో Lyrics

అప్పగింపబడిన రాత్రి
చెప్ప సాగే శిష్యులతో (2)
చెప్పరాని దుఃఖముతో
తప్పదు నాకీ మరణమనెను (2)       ||అప్పగింప||

రొట్టె విరచి ప్రార్ధించి
నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2)
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు
ఇట్టులనే భుజించుడనెను (2)       ||అప్పగింప||

ద్రాక్షా రస గిన్నెను చాపి
వీక్షించుడిదియే నా రక్తం (2)
రక్షణార్థం దీని త్రాగి
మోక్ష రాజ్యం చేరుడనెను (2)       ||అప్పగింప||

రాతివేత దూరాన
చేతులెత్తి ప్రభు మోకరించి (2)
నా తండ్రి నీ చిత్తమైతే
ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2)       ||అప్పగింప||

ఇదిగో వచ్చె తుది ఘడియ
హృదయ బాధ హెచ్చెను (2)
పదిలపరచు-నట్లు తండ్రిన్
మదిలో వదలక ప్రార్ధించుడనెను (2)       ||అప్పగింప||

Your favourites

  • No Favourites found!