Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ Telugu Christian Song Lyrics

అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ Lyrics

అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి
కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని
వేయుట కొప్పి ||రపు డర్చ||

1. యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ
సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ
గొట్టి ||రపు డర్చ||

2. చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము
నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి
కనుపట్టె ||నపు డర్చ||

3. గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వఁ
గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు
కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె ||నపు డర్చ||

Your favourites

  • No Favourites found!