Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా Telugu Christian Song Lyrics

ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా Lyrics

ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా (2)
విశ్వవిజేతవు – సత్యవిధాతవు
నిత్యమహిమకు ఆధారము నీవు (2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైనకృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా
నీకేనయ్యా స్తుతిఆరాధనా (2)
                                       ||ఆశ్రయుడా||
1. తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు (2)
కరుణనిచూపి కలుషముబాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు (2)
జనులకు దైవం జగతికి దీపం
నీవుగాక ఎవరున్నారు ?
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహరాజువు (2)
                                       ||ఆశ్రయుడా||
2. జీవితదినములు అధికములగునని
వాగ్దానముచేసి దీవించితివి (2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశలజాడలు చూపించితివి (2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలనుబాపి నా స్థితిమార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా (2)
                                       ||ఆశ్రయుడా||
3. నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతిఅర్పణ (2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు (2)
ప్రతివిషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించెదరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా (2)
                                       ||ఆశ్రయుడా||

Your favourites

  • No Favourites found!