అతి సుందరుడవు యేసయ్య …
మనోహరుడవు నీవయ్యా… (2)
యదార్థవంతుల సభలో పరిశుద్ధులుతో కలిసి
నిన్ను ఆరాధించెను (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా – హోసన్నా ఆరాధన
1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు (2)
నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను – (2)
పరవశించి పరవళ్లు త్రొక్కి ఆరాధించెదను – (2)
||అతిసుందరుడవు||
2. అమూల్యమైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి యున్నావు (2)
విశ్వాసముతో ఓర్పు గలిగి వాగ్దానమును పొందెదను – (2)
సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను – (2)
||అతిసుందరుడవు||
3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు
పునాదులు గల పట్టణము కట్టుచున్నావు (2)
సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుచున్నావు – (2)
నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను – (2)
||అతిసుందరుడవు||
ఆరాధనకు నీవే యోగ్యుడవు –
స్తుతులకు నీవే పాత్రుడవు (2)
అతి సుందరుడా – మనోహరుడా (2)
||అతిసుందరుడవు||
