Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అత్యంత సుందరుండునుఎల్లరి కాంక్షణీయుడుదేవాది దేవుడైన మాకల్వరి Telugu Christian Song Lyrics

అత్యంత సుందరుండునుఎల్లరి కాంక్షణీయుడుదేవాది దేవుడైన మాకల్వరి Lyrics

1. అత్యంత సుందరుండును
ఎల్లరి కాంక్షణీయుడు
దేవాది దేవుడైన మా
కల్వరి యేసు నాథుడు
కల్వరి నాథుడా - నన్ను జయించితి
రక్షింప మృతుడైన - కల్వరి యేసు నాథుడా
2. గాయపడి శ్రమలతో
పాపదుఃఖము మోసితివి
సిల్వలో మరణించితివి
దుఃఖ కల్వరి నాథుడా
3. శాంతి జీవము నీయను
ఖైదీల విమోచనమునకై
రక్తపు ఊట తెరచితివి
ప్రేమ కల్వరి నాథుడా
4. తెచ్చిన ఈవులెల్లను
మేలుకొరకు మనకిచ్చి
ప్రేమనదిని పోసెను
దయాకల్వరి నాథుడా
5. మహిమ పూర్ణుడగు నిన్ను
కండ్లార చూతుమనుటయే
ఇచ్చట మా ఆదరణ
సాటిలేని కల్వరి ప్రభూ
6. స్పటిక సముద్ర తీరమున
నీ ప్రేమయందు మున్గుచు
నీ వలె నుందు నిత్యము
మహిమ కల్వరి నాథుడా



Your favourites

  • No Favourites found!