Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అత్యునత సింహాసనము పై అత్యున్నత సింహాసనముపై Telugu Christian Song Lyrics

అత్యునత సింహాసనము పై అత్యున్నత సింహాసనముపై Lyrics

అత్యునత సింహాసనము పై

పల్లవి: అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే
ఆహాహా ... హల్లేలూయ (4X)
ఆహాహా ... హల్లేలూయ (3X) ...ఆమెన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం
…ఆహాహా…
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం
…ఆహాహా…
3. ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం
…ఆహాహా…
4. మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం
…ఆహాహా

Your favourites

  • No Favourites found!