Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అత్యున్నత సింహాసనముపై  ఆసీనుడవైన దేవాఅత్యంత Telugu Christian Song Lyrics

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవాఅత్యంత Lyrics

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా||
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా||
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా||
మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా||
ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||

Your favourites

  • No Favourites found!