Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అయ్యా వందనాలు అయ్యా వందనాలు Telugu Christian Song Lyrics

అయ్యా వందనాలు అయ్యా వందనాలు Lyrics

అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే (2)

మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే (2)
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2)       ||అయ్యా||

అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)       ||అయ్యా||

Your favourites

  • No Favourites found!