Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై Telugu Christian Song Lyrics

అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై Lyrics

అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము
వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో||

1. నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు
నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన
||దయ్యో||

2. కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యల
మేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||

3. మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి
రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా
||రయ్యో||

4. కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి
నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ ||మయ్యో||

5. ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ
కండ్ల కొక్క గంతఁ గడ గండు పెట్టఁ గారణము నిజముగా ||నయ్యో||

6. ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా
భావమందుఁ దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ
||మయ్యో||

Your favourites

  • No Favourites found!