Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ Telugu Christian Song Lyrics

అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ Lyrics

అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత
దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు
నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||

1. తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల
మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||

2. అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ
డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||

3. భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ
కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||రయ్యో||

4. క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు
లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||రయ్యో||

5. శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు
రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||

6. అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల
నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||

7. సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో
ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము
ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||

Your favourites

  • No Favourites found!