బాల యేసుకు జోలలు పాడ ఈ వేళ – పరలోక సైన్యముల్ పాటలు పాడెన్ ఆ వేళ
హద్దు దప్పినా లోకములోన ఆ వేళ – జన్మించె శాంతి ప్రియుడై
ప్రేమమయుడై నీతికి స్థాపకుడై ||బాల||
1.కన్య మేరి ధన్య చరిత్రుండా వేళ – మన పాపరాశికి పావనరక్షా ఈ వేళ
అవతరించె పరిహార మొనర్చన్ ఆ వేళ – మన జీవిత లోపాలు
దురంతాలు ఘోరమౌ పాపాలు ||బాల||
2.పశులశాలలో శిశువై వెలసెన్ ఆ వేళ – సువిశాల లోకపు శోకము మాపెన్ ఈ వేళ
చిన్ని బాలలానంద వినోదం ఈ వేళ – చిరునవ్వులు వికసించె
ప్రకాశించె ప్రీతియై పరికించె ||బాల||
3.హృదయసీమ పదిలంబాయె ఈ వేళ – మదిలోని మమతలె మారణమాయె ఈ వేళ
తార వెలసెనోయ్ దారి జూపనోయ్ ఆ వేళ – ఆ చల్లని మార్గంబు
సరాళంబు పాపికి తరుణంబు ||బాల||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
బాల యేసుకు జోలలు పాడ ఈ Lyrics
Your favourites
- No Favourites found!
