బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా మేలులుకుఁ బలు కీడు
లకునదె మూలమనిగమనింపరా ||బాలకా||
1. తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుఁడు
పడిన తిప్పలు నీ వెఱుఁగవా? ||బాలకా||
2. గోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను
నవ్వి ప్రాణగొడ్డమునొందరే ||బాలకా||
3. పరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే పరునికై హామాను
నిల్పిన కొఱఁత నతఁడే వ్రేలఁడే ||బాలకా||
4. కట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి
యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా? ||బాలకా||
5. వగవకుము పరధనముఁగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె
యాహబుతా శునకముల కాహారమై? ||బాలకా||
6. ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన
యాలితో సహకూలఁడే ||బాలకా||
7. కోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు
పెంచికయ్యిను గోడు చెందడె హంతయై ||బాలకా||
8. తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల
సాంగత్యమున రెహ బాము భంగము నొందఁడే ||బాలకా||
9. బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ
మొదవునీ కా శీస్సులను జేకూరురా ||బాలకా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
బాలకా నీ వర్తనము గా పాడుకొని Lyrics
Your favourites
- No Favourites found!
