Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు Telugu Christian Song Lyrics

బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు Lyrics

బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు సేయుమా పరమ
పోషకా||

1. బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ
బ్రోవుమా||

2. మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా
యందు జూపుమా||

3. చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ
మరువనీకుమీ||

4. ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు
మఖిలకాలము||

5. పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ
జేర గరుణజూపుము ||

Your favourites

  • No Favourites found!