Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా Telugu Christian Song Lyrics

బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా Lyrics

బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – (2)
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే

1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు (2)
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ
నీకే నాహృదయార్పణ (2)   ||బహు||

2. ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు (2)
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక (2)   ||బహు||

3. ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే (2)
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే (2)   ||బహు||

Your favourites

  • No Favourites found!