Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయము Telugu Christian Song Lyrics

బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయము Lyrics

బలపరచుము స్థిరపరచుము
నా ప్రార్థనకు బదులీయము (2)
లోకాశల వైపు చూడకూండా
లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకు       ||బలపరచుము||

నా మాటలలో నా పాటలలో
నీ సువార్తను ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ
నే నిలుచు చోటు లోతైననూ (2)
నే జడవక నిను కొలుతును       ||బలపరచుము||

ధ్యానింతును కీర్తింతును
నీ వాక్యమును అను నిత్యము (2)
అపవాది నన్ను శోధించినా
శ్రమలన్ని నాపై సంధించినా (2)
నే జడవక నిను కొలుతును     ||బలపరచుము||

Your favourites

  • No Favourites found!