Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ Telugu Christian Song Lyrics

భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ Lyrics

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను||

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను||

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను||

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను||

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2)     ||భాసిల్లెను||

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2)     ||భాసిల్లెను||

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2)      ||భాసిల్లెను||

Your favourites

  • No Favourites found!