Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును Telugu Christian Song Lyrics

భజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును Lyrics

భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును (2)
వృజినములపై జయము నిచ్చిన (2)
విజయుడా నిను వేడుకొందు ||భజన||
దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు (2)
భవ్యమైన బోధలెన్నో (2)
బాగుగా ధర నేర్పినావు ||భజన||
నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు (2)
పరుడ నైన నా కొరకు నీ (2)
ప్రాణము నర్పించినావు ||భజన||
చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు (2)
పడిన నాడు గోతి నుండి (2)
పైకి లేవనెత్తి నావు ||భజన||
ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు (2)
ఇంతయని వర్ణింప నిలలో (2)
నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||

Your favourites

  • No Favourites found!