Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును Telugu Christian Song Lyrics

భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును Lyrics

భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై
జయము నిచ్చిన విజయుఁడా నిను వేఁడుకొందు||

1. దివ్యపదవిని విడిచి నీవు దీనుఁడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో
బాగుగా ధర నేర్పినావు ||భజన||

2. నరులఁ గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుఁడ నైన నా
కొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన||

3. చెడినవాఁడ నైన నన్నుఁ జేరఁదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి
పైకి లేవనెత్తి నావు ||భజన||

4. ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని
వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు ||భజన||

Your favourites

  • No Favourites found!