Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల Telugu Christian Song Lyrics

భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల Lyrics

భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల జయ శూరుడగు
ప్రభువు యిలనీకు జయము నిచ్చుచు నుండగ ||భయమేల||

1. భూతపీడితుల నెల్ల విడిపించుదాత మన రక్షకుండు సాతాను వల
నుండియు విడిపించిప నీతితో మనుపలేడా ||భయమేల||

2. మరణ పాశములనుండి లాజరును కరుణతో లేపలేదా ధరణిమిమ్ముల
నూతన బలముతో గుఱికి నడిపించలేడా ||భయమేల||

3. ద్రాక్షరసముగ నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ
సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా ||భయమేల||

4. ఐదు చిన్న రొట్టెలు మరి రెండు చిన్న చేపలతోడును ఐదువేల
మందిని బలపర్చినట్టి రక్షకుడుండగ ||భయమేల||

5. విజయకరముగ బ్రతుకు ప్రభువుండు నిజవాగ్దత్తము లివ్వ నీ
వృజినము గెలువంగను ముదముతో నిజముగ నెరవేర్చడా ||భయమేల||

Your favourites

  • No Favourites found!