Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భయపడకుము నీవు యుద్ధము యెహోవదే నిశ్చయముగ Telugu Christian Song Lyrics

భయపడకుము నీవు యుద్ధము యెహోవదే నిశ్చయముగ Lyrics

భయపడకుము నీవు - యుద్ధము యెహోవదే
నిశ్చయముగ జయము - నీదే భయపడకుము
1. గర్జించు సింహమువలె శత్రువు - నీపైని బడ జూచుచుండె
నదివలె నీపై పారవచ్చును - యుద్ధము యెహోవదే భయపడకు
2. పాలు తేనెలు ప్రవహించెడు - కానాను మీయెదుట నుండె
శత్రువు నిన్ను జంపజూచె - యుద్ధము యెహోవదే భయపడకు
3. నీకు విరోధముగ రూపించు - యే ఆయుధము వర్ధిల్లదు
ప్రతి నాలుక తీర్పుకు లోనగును - యుద్ధము యెహోవదే భయపడకు
4. ఇహపరమునందు మన ప్రభువునకు - సర్వాధికారము నియ్యబడెను
ఆయన సన్నిధి నీతో యుండును - యుద్ధము యెహోవదే భయపడకు
5. నీవు పోరాడెడు పనిలేదు - నమ్మకముంచి విశ్వాసముతో
రక్షణను తిలకించుము - జయము ప్రభువుదే భయపడకు


Your favourites

  • No Favourites found!