Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భూదిగంత నివాసులారా నేడే రక్షణ పొందండి Telugu Christian Song Lyrics

భూదిగంత నివాసులారా నేడే రక్షణ పొందండి Lyrics

భూదిగంత నివాసులారా - నేడే రక్షణ పొందండి (2)
ఇదియే సమయము - యుగ సమాప్తి కాలము (2)
నేడే యేసుని చేరుడి - హల్లెలూయ గానము చేయుడి(2)
1. చీకటిలో ఉన్నవారికి - వెలుగును చూపించును
చెరలోనున్న వారికి - విడుదల దయచేయును (2)
మూగవారికి - మాటలు దయచేయును- గ్రుడ్డివారు - చూపు పొందుదురు
తన నామమున - రక్షణ దయచేయును (2)IIఇదియేII
2. లోబడనొల్లని వారలకు - దినమెల్ల చేతులు చాచును
తనను వెదకని వారికి - ఉచితముగా దొరుకును (2)
మన పాపములు - తలకు మించినవై యున్నవి-
మన దోషములు - ఆకాశమంత ఎత్తుగా నున్నవి
మన కొరకు సిలువలో - మరణించి లేచెను (2) IIఇదియేII

Your favourites

  • No Favourites found!