Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భూమండలము దాని సంపూర్ణత యును లోకమునుభూమండల Telugu Christian Song Lyrics

భూమండలము దాని సంపూర్ణత యును లోకమునుభూమండల Lyrics

భూమండలము దాని సంపూర్ణత యును లోకమును
భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ||

1.
యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె
మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ||

2.
యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు
మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ||

3.
అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక
సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ||

4.
ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు
భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ||

5.
ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ
ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే ||భూ||

6.
ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్
రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి ||భూ||

7.
ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు
బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ ||భూ||

Your favourites

  • No Favourites found!