Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా Telugu Christian Song Lyrics

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా Lyrics

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా

నిలవాలని ఉన్నా నిలవలేకున్నా

చూడాలని ఉన్నా చూడలేకున్నా

చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా

బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య

కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి

కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి

గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి

గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2)


నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం

శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం

చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి

గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)

Your favourites

  • No Favourites found!