Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట Telugu Christian Song Lyrics

చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట Lyrics

చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడో
మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని||

1. నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాల
ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని||

2. పన్నెండు ద్వారముల పరమపురమును నా కన్నుజూచుట యెన్నడో చెన్ను
మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో ||చక్కని||

3. పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో
పరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుట
యెన్నడో ||చక్కని||

4. మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగను
టెన్నడో అహహా యా ప్రభునితో మహిమపరచబడి మహికేతెంచుట యెన్నడో
||చక్కని||

5. పాపశరీరముఁ బాసి ప్రభుని యొక్క రూపునొందుటయెన్నడో పాప
మరణ దుఁఖ మీ యాపదల కెడ బాపు నొందుట యెన్నడో ||చక్కని||

6. రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే
ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని||

Your favourites

  • No Favourites found!