చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా మంచోడు – చాలా చాలా మంచోడు
నాకు దొరికిన నా యేసుడు (2)
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత (2)
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)
1. నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువరిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణానాతీతం
తన జాలి వర్ణనాతీతం (2)
// చాలా.. చాలా గొప్పోడు//
2. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెతికిన కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతితం
తన జాలి వర్ణనాతితం (2)
// చాలా.. చాలా గొప్పోడు//
3. ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ (2)
// చాలా.. చాలా గొప్పోడు//
