Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చీకటులే నన్ను కమ్ముకొనంగా Telugu Christian Song Lyrics

చీకటులే నన్ను కమ్ముకొనంగా Lyrics

చీకటులే నన్ను కమ్ముకొనంగా

దుఃఖంబు నాకాహారంబు కాగా

ఏకాకినై లోకంబులోన

కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)

మేఘములు నన్ను ముసుగుకొనంగా

ఉరుములు నాపై దొరలుచుండంగా

వడగండ్ల వాన కురియుచుండంగా

కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)

అన్యాయ క్రియలు అధికంబు కాగా

మోసంబులే నాకు వ్యసనంబు కలుగ

ఆకాశ శక్తులు కదలించబడగా

కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)

త్వరలోనే రమ్ము పరలోక వరుడా

వరమేని తనయా ఓ గొర్రెపిల్లా (2)

కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2)

కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)     ||చీకటులే||

Your favourites

  • No Favourites found!