Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు Telugu Christian Song Lyrics

చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు Lyrics

చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు తోరణంబగు
మేడ గదిలో జేరి శిష్యుల తోడ సిలువ భారమున్ మదినెంచి నెరపిన
భావ గర్భితమైన విందు ||చేరి||

1. జీవాహారము దైవసుతుడే పరమ జీవజలముల దాత యితడే
జీవనాధుని రక్త మేనులు జీవానాహారములు కాగా చావును దొల గించి
మృతులస జీవులనుగా మార్చువిందు ||చేరి||

2. కారుణ్యనిధి యేసు రాజు నరుల గావగ బలియైన రోజు భారమైన
సిలువ కెరయై పాప భారము పరిహరింప ధారవోసిన పుణ్యరక్తపు
ధారలన్ దలపోయు విందు ||చేరి||

3. దాసగణముల బ్రోవనెంచి రుధిర ధారలను గార్చిభరించి భాసు
రంబగు నవ నిబంధన జేసి సంఘ పునాది వేసి వాసి మీరగ నిత్య
జీవము బోసినట్టి యేసు విందు ||చేరి||

4. పాప పరిహారార్థముకై క్రీస్తు పడిన ఘోరబాధ కొరకై యేపు దనరగ
స్తుతులుబాడుచు యేసునాధుని రాకవరకు ఆపకుండగ సత్ప్రసాదము
నందుకొని బలమొంద రండి ||చేరి||

5. విందుతో మొదలిడిన సేవ యేసు విందుతో ముగియించె బ్రోవ
విందులోగల మర్మమేదియొ విపులముగ బోధించు క్రీస్తున్ డెందమున
ధ్యానించి యాయన యందె నమ్మిక గలిగియుందము ||చేరి||

Your favourites

  • No Favourites found!