Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు Telugu Christian Song Lyrics

చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు Lyrics

చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు
మముఁ బ్రీతితోఁ గాపాడు యేసు ||చేతు||

1. సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందఁజేసి రాత్రియందు సకల మేలు లంద
జేయు స్వామి యేసుక్రీస్తూ నీకుఁ ||చేతు||

2. అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను
బెంచు చున్న యేసుస్వామీ నీకే ||చేతు||

3. విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల
దయలోనుమమ్ముఁ బెంపారఁ జేయు మేసయ్యా ||చేతు||

4. చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు
నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||

Your favourites

  • No Favourites found!