Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చింత లేదిక యేసు పుట్టెను Telugu Christian Song Lyrics

చింత లేదిక యేసు పుట్టెను Lyrics

పల్లవి:
చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లెహేమందున

చెంతజేరను రండి సర్వజనంగమా - సంతస మొందుమా
...చింత...

1.
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా

ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి - స్తుతు లొనరించిరి
...చింత...

2.
చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని

చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి
...చింత...

3.
కన్య గర్భమునందు బుట్టెను - కరుణ గల రక్షకుడు క్రీస్తుడు

ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వమాన్యులై
...చింత...

4.
పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను

దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము - మోక్షభాగ్యము

Your favourites

  • No Favourites found!