Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను Telugu Christian Song Lyrics

చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను Lyrics

చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంత
జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత||

1. దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి
మీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత||

2. చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన
చక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత||

3. కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు
ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత||

4. పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుఁ డవతరించెను దాపుఁ
జేరిన వారి కిడుఁ గడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత||

Your favourites

  • No Favourites found!