Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చిరు దివ్వెల వెలుగులతో Telugu Christian Song Lyrics

చిరు దివ్వెల వెలుగులతో Lyrics


చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా (2)
ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2)

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము (2)         ||చిరు||

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
తాళలేను ఈ నరకము (2)
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము (4)           ||చిరు||

Your favourites

  • No Favourites found!