Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ Telugu Christian Song Lyrics

చూచుచున్నాము నీ వైపు మా ప్రియ Lyrics

చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము
నీవైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాఁచుచుఁ గరములు
చక్కఁగా నీవైపు ||చూచు||

1.
మేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకుఁ
బ్రేమను జూపితివి ||చూచు||

2.
నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు
ఇనుఁడవు కేడెంబు నీ జగతిలో నగుచుఁ గనుపరచుచుందువు ఘన
మైన నీ కృపఁ ||చూచు||

3.
నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని
గొన్నాళ్ళు ||చూచు||

4.
దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి దయచేయుమని కోరఁ దయజూపి మన్నించు దయగల
మా తండ్రి ||చూచు||

Your favourites

  • No Favourites found!