చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద
చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి
చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా ||చూడ||
1.
నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు
నానంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ||
2.
జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె
గూటి తావు నీ మందిరమున ||చూడ||
3.
పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు
కుతూహలముతోను పిల్లల నవి మందిరమున ||చూడ||
4.
నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు
నిన్ను నన్నుతింతు రహా ||చూడ||
5.
ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల
ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ||
6.
నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల
నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ||చూడ||
7.
కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున
కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ Lyrics
Your favourites
- No Favourites found!
