Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార Telugu Christian Song Lyrics

చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార Lyrics

చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే
చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో ||చూడరే||

1. మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను
గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ
ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది
||చూడరే||

2. మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ
గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది
మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ
బ్రాణము లుండునే యిఁకఁ ||జూడరే||

3. ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ
జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి
వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ
జేసిరి ||చూడరే||

Your favourites

  • No Favourites found!