చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమి
వాసులకు నిండు రక్షణబ్బెను ||చూడరే||
1. ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతి
కన్ననది మించెను ||చూడరే||
2. దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురిని
కర్తయేసు పుట్టుటన్ ||చూడరే||
3. తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవ
వరుసగాను జేసిరి ||చూడరే||
4. మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకు
శాంతిఁ గ్రక్కున నొసంగును ||చూడరే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో Lyrics
Your favourites
- No Favourites found!
