Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దారి తప్పి పోతున్నావా Telugu Christian Song Lyrics

దారి తప్పి పోతున్నావా Lyrics


దారి తప్పి పోతున్నావా విశ్వాసి
తీరమేదో గమనించావా విశ్వాసి (2)

ఈ లోకం ముళ్ళ బాట
విశ్రాంతి లేని చోట (2)
యేసయ్యే జీవపు బాట
సాగిపో ఆయన వెంట (2)
యేసుతో నీవొస్తావా విశ్వాసి
లోకం విడిచి రానంటావా విశ్వాసి (2)        ||దారి||

ఓడలోని నల్ల కాకి
చూడ నేర్చే ఈ లోకాన్ని (2)
చూడ చూడ లోకపు రుచి
ఓడ మరచిపోయే కాకి (2)
కాకిలా నీవుంటావా విశ్వాసి
పావురంలా తిరిగొస్తావా విశ్వాసి (2)       ||దారి||

ఓడలోనున్ననాడు
యేసు నీకు తోడుంటాడు (2)
ఆశ్రయంబుగా ఉంటాడు
ఆశలన్నీ తీరుస్తాడు (2)
యేసులో నీవుంటావా విశ్వాసి
సంఘమందు చేరుంటావా విశ్వాసి (2)      ||దారి||

Your favourites

  • No Favourites found!