దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర
మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు
డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||
1. ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు
ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన
యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||
2. మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట
పొంగి పారుచు మరణ నది త రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి
మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||
3. వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును
బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన క్రీస్తు యేసు నాధుఁడే నావి
కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ||
4. మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె
దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన
మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||
5. విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ
గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే
హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||
6. పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు
ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల
గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||
7. కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున
మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ
మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దారుణ మగు మరణ వారిధి దాఁట Lyrics
Your favourites
- No Favourites found!
