దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు
గుదమ ||దాతృ||
1. శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ
||దాతృ||
2. సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ
||దాతృ||
3. గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు
నేర్పింతమ ||దాతృ||
4. సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ
||దాతృ||
5. ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ
బోధింతమ ||దాతృ||
6. విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో
దర్శింతము ||దాతృ||
7. దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృ||
8. పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ
||దాతృ||
9. వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ
||దాతృ||
10. వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి Lyrics
Your favourites
- No Favourites found!
