Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని Telugu Christian Song Lyrics

దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని Lyrics

దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను
దిరముగా కాపాడుగా||

1. పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల
మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవ||

2. నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము
క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవ||

3. మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము
కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవ||

4. జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి
యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా ||దైవ||

Your favourites

  • No Favourites found!