దైవతనయా క్రీస్తునాథుండా – అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా (2) || దైవ ||
1. పాపులకై వచ్చినావా
పాపులను కరుణించినావా (2)
ప్రాణదానము చేసినావా
దేవా – పరలోకము తెరచినావా (2) || దైవ ||
2. కల్వరిలో కార్చినట్టి
దివ్యరక్తముచే మమ్ము (2)
కడిగి పావన పరచినావా
దేవా – కడకు బూరతో రానై యున్నావా (2) || దైవ ||
3. మరణము జయించినావా
మరణముల్లు విరచినావా (2)
మహిమతోడ లేచినావా
దేవా – మాదు చింతలు దీర్చినావా (2) || దైవ ||
4. ధరణిలో అతి దుష్టులముగా
దారి తెలియక దూరమైతిమి (2)
ధరణికే ఏతెంచినావా
దేవా – ధన్యులనుగా జేసినావా (2) || దైవ ||
5. ఆదియంతము లేనివాడా
అందరికిని దేవుడవు (2)
అల్ఫయు ఓ మేగయు నీవేగా
యేసు – ఆర్భటించుచు రానై యున్నావా (2) || దైవ ||
